Nandigama Degree Student Commits Suicide In NTR District, Details Inside - Sakshi
Sakshi News home page

డిగ్రీ విద్యార్థిని షాకింగ్‌ నిర్ణయం.. అసలు ఏం జరిగింది?

Jan 4 2023 4:40 PM | Updated on Jan 4 2023 6:46 PM

Student Commits Suicide In NTR District - Sakshi

హరీష (ఫైల్‌)

ఆమెను గుర్తించిన కుటుంబ సభ్యులు తొలుత నందిగామ ఆస్పత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

పెనుగంచిప్రోలు(జగ్గయ్యపేట) ఎన్టీఆర్‌ జిల్లా: గడ్డి మందు తాగి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని సుబ్బాయిగూడెం గ్రామంలో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. సుబ్బాయిగూడెం గ్రామానికి చెందిన పసుపులేటి హరీష(20) నందిగామ లోని ఒక ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది. కొంత కాలంగా ఆరోగ్యం సరిగా లేక కళాశాలకు సక్రమంగా వెళ్లటం లేదు.

కళాశాలకు వెళ్లటం లేదని తండ్రి మందలించడంతో మనస్తాపం చెందిన హరీష ఈ నెల ఒకటో తేదీన గడ్డి మందు తాగింది. ఆమెను గుర్తించిన కుటుంబ సభ్యులు తొలుత నందిగామ ఆస్పత్రికి, అనంతరం మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందున్న ఆమె పరిస్థితి విషమించి సోమవారం రాత్రి మృతి చెందింది. తండ్రి శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ హరిప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: టీడీపీలో ‘కరివేపాకులు’.. నమ్ముకున్నోళ్లనే ముంచేస్తున్నాడు మావా.. 

Advertisement
 
Advertisement
Advertisement