అపరిచితుడితో ఫోన్‌లో మాట్లాడి వివాహిత అదృశ్యం.. మరోచోట విద్యార్థిని.. | Student and Married Woman Missing in Sangareddy District | Sakshi
Sakshi News home page

అపరిచితుడితో ఫోన్‌లో మాట్లాడి వివాహిత అదృశ్యం.. మరోచోట విద్యార్థిని..

Oct 9 2022 9:23 AM | Updated on Oct 9 2022 10:42 AM

Student and Married Woman Missing in Sangareddy District - Sakshi

సునీత, పూజిత

సాక్షి, సంగారెడ్డి: వివాహిత అదృశ్యమైన సంఘటన శనివారం జరిగింది. నారాయణఖేడ్‌ ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నాగల్‌గిద్ద మండలం ఇరక్‌పల్లికి చెందిన జంగెదొడ్డి సునీల్‌ (30), జంగెదొడ్డి సునీత (25) దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. సెప్టెంబర్‌ 27వ తేదీ సాయంత్రం 7 గంటల సమయంలో నారాయణఖేడ్‌లోని సువర్ణ షెట్కార్‌ టాకీసు సమీపంలో అపరిచితుడితో ఫోన్‌లో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో భర్త బందువులు, తెలిసిన వారిని విచారించినా ఆమె ఆచూకీ తెలియరాలేదు. సునీల్‌ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

నర్సాపూర్‌రూరల్‌: విద్యార్థిని అదృశ్యమైన సంఘటన శనివారం జరిగింది. నర్సాపూర్‌ పట్టణ పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. నర్సాపూర్‌కు చెందిన నర్సింలు కూతురు పూజిత (19) శనివారం అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నట్లు చెప్పి వెళ్లింది. కాని అక్కడికి రాకపోవడంతో ఆందోళనకు గురైన పూజిత అన్న మల్లికార్జున్‌తోపాటు కుటుంబ సభ్యులు బంధువులు, స్నేహితులను విచారించినా ఆచూకీ లభించలేదు. దీంతో మల్లికార్జున్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   

చదవండి: (రెండుసార్లు ప్రేమలో విఫలం.. విధానసౌధలో బాంబు.. త్వరలో పేలిపోతుందని..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement