దారుణం: 4 ఏళ్ల బాలికపై మారుతండ్రి అత్యాచారం | Step Father Molested 4 Year Old Girl In Uttar Pradesh | Sakshi
Sakshi News home page

దారుణం: 4 ఏళ్ల బాలికపై మారుతండ్రి అత్యాచారం

Mar 12 2021 2:31 PM | Updated on Mar 12 2021 2:59 PM

Step Father Molested 4 Year Old Girl In Uttar Pradesh - Sakshi

లక్నో: ఉత్తరప్రదేశ్ లో ‌ దారుణం చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలికపై మారుతండ్రి (స్టెప్‌ ఫాదర్‌) లైంగిక దాడికి పాల్పడిన ఘటన గురువారం సాయంత్రం జరిగింది. ఈ ఘటనపై బాలిక మామయ్య రతన్‌పూరి స్టేషన్‌ హౌజ్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి అతడిని అరెస్టు చేసినట్లు స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌ వింధ్యచల్‌ తివారి తెలిపారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. ముజఫర్‌ జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన మైనర్‌ బాలిక తల్లి రెండేళ్ల క్రితం నిందితుడు(50)ని రెండో పెళ్లి చేసుకుంది.

బాధిత బాలిక ఆమె మొదటి భర్త కూతురు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం నిందితుడు బాలికను సమీపంలో పొలాల్లోకి తీసుకేళ్లి అత్యాచారం చేశాడు. ఈ విషయం తెలియగానే గ్రామస్తులంతా నిందితుడి ఇంటి ఎదుట గుమికూడి అతడిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని పొక్సో చట్టం, అత్యాచారం కింద కేసు నమోదు చేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement