గుజ్జల శ్రీనివాసులు ఇంట్లో సీఐడీ సోదాలు

సాక్షి, వైఎస్సార్ కడప: ఆప్కో(ఆంధ్రప్రదేశ్ చేనేత ప్రాథమిక సహకార సంఘం) మాజీ చైర్మన్ గుజ్జల శ్రీనివాసులు ఇంట్లో సీబీసీఐడీ అధికారులు రెండో రోజు సోదాలు నిర్వహించారు. ఇంటితో పాటు ఆయన సొసైటీకి సంబంధించిన గోడౌన్‌లపై ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేపట్టారు. రెండు రోజుల క్రితం ఆయన ఇంట్లో జరిగిన దాడుల్లో పెద్ద మొత్తంలో నగదు, బంగారం, వెండితో పాటు పలు కీలక డ్యాక్యుమెంట్లను సీఐడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇప్పటికే ప్రొద్దుటూరులో చేనేత సొసైటీలో జరిగిన అక్రమాల పరంపరలో సొసైటీల అకౌంటెంట్లు శ్రీరాములు, కొండయ్య ఇళ్లపై సీఐడీ అధికారుల దాడులు చేసిన విషయం తెలిసిందే.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి