తాత ఒకరికి... మనవడు మరొకరికి !

Same Land Registered Different People in Warangal Revenue Fraud - Sakshi

ఒకే స్థలాన్ని వేర్వేరు వ్యక్తులకు రిజిస్ట్రేషన్‌ చేసిన వైనం

ఆందోళనలో కొనుగోలుదారులు

కలెక్టర్‌తో పాటు పోలీసు అధికారులకు ఫిర్యాదు

వరంగల్‌ అర్బన్‌ ,హసన్‌పర్తి : జిల్లా కేంద్రం శివార్లలోని భూముల ధరలకు రెక్కలు రావడంతో అదే స్థాయిలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. పూర్వీకులు అమ్మిన భూములపై కన్నేసిన వారి వారసులు, సిబ్బందితో కుమ్మక్కై రికార్డుల్లో తమ పేర్లు చేర్పించుకుంటున్నారు. ఆ తర్వాత మళ్లీ అదే భూములను ఇంకొకరికి విక్రయిస్తుండడంతో తొలుత కొనుగోలు చేసిన వారు నష్టపోవాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. జిల్లాలోని హసన్‌పర్తి రెవెన్యూ పరిధిలోని చింతగట్టు శివారులో ఇలాంటి ఘటన వెలుగు చూసింది.

1968లో తొలి విక్రయం
హసన్‌పర్తి మండలం చింతగట్టు శివారులోని సర్వే నంబర్‌ 53/ఏలో 2.11ఎకరాల భూమిని పట్టాదారులు బిల్లా జగన్నాథరెడ్డి నుంచి జనగాని కనకయ్య 1968(డాక్యుమెంట్‌ నంబర్‌ 607/1968)లో కొనుగోలు చేశారు. ఈ భూమిని కనకయ్య మరణాంతరం ఆయన వారసులు జనగాని రామస్వామి డాక్యుమెంట్‌ నంబర్‌ 156/1994 ద్వారా బిల్లా ప్రభాకర్‌రావుకు జీపీఏ ఇచ్చారు. అనంతరం 1994లోనే భూమిని ప్రభాకర్‌రావు ప్లాట్లుగా విభజించగా ఎంజీఎం ఆస్పత్రిలో పనిచేస్తున్న 34మంది ఉద్యోగులు కొనుగోలు చేశారు. అప్పటి నుంచి 2010 వరకు సదరు ఉద్యోగులే మోఖాపై ఉన్నారు. అయితే, పహాణీలో మాత్రం 2010 వరకు జగన్నాథరెడ్డి కొనసాగుతూ రాగా, ఖరీదు చేసిన కనకయ్య పేరు కనిపించలేదు.

2010లో రికార్డుల్లో పేరు మార్పిడి
మొదట జగన్నాథరెడ్డి పేరిట రికార్డుల్లో ఉండగా, 2010లో మాత్రం రెవెన్యూ రికార్డుల్లో ఆయన మనవడు బిల్లా రవీందర్‌రెడ్డి పేరు నమోదైంది. దీంతో రవీందర్‌రెడ్డి ఆ భూమిని నగరానికి చెందిన సాయిరెడ్డికి విక్రయించినట్లు బాధితులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై సాయిరెడ్డి కోర్టును ఆశ్రయించగా, ఆయన ఓఎస్‌ నంబర్‌ 824/2011 ప్రకారం ఆయన ఫైల్‌ను కోర్టు తిరస్కరించినట్లు బాధితులు తెలిపారు.ఓఎస్‌ నంబర్‌496/2011 ప్ర కారం తాము రవీందర్‌రెడ్డిపై కోర్టును ఆశయించగా, కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఆ భూమిపై 23–03–2018న శా శ్వ త ఇంజక్షన్‌ ఆర్డర్‌ పొందినట్లు బాధితులు క లెక్టర్‌కు ఇచ్చిన వినతిపత్రంలో పేర్కొన్నారు. అ యితే సాయిరెడ్డి మాత్రం మరోవ్యక్తి ద్వారా త మకు తప్పుడు కేసుబనాయించాడని వాపోయారు.శాశ్వత ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉన్నా తమను మోఖాపైకి రానివ్వడం లేదని, కోర్టు ఉత్తర్వుల మేరకు పహాణీలో రవీందర్‌రెడ్డి పేరుతొలగించి తమ పేర్లు చేర్చాలని వారు కోరారు.ఈవిషయ మై కలెక్టర్‌తోపాటు హసన్‌పర్తి రెవెన్యూ అ ధికా రులు,కేయూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫిర్యాదును పరిశీలిస్తున్నాం...
చింతగట్టు శివారులో భూమికి సంబంధించి మాకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు ఎంజీఎం ఉద్యోగులు కొనుగోలు చేసినప్పటి పత్రాలను పరిశీలిస్తున్నాం. దర్యాప్తు చేపట్టి కేసు నమోదు విషయమై నిర్ణయం తీసుకుంటాం.– డేవిడ్‌రాజు, పోలీస్‌ ఇన్‌స్పెక్టర్, కేయూసీ

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top