కారు డ్రైవర్‌కు మద్యం తాగించి.. ఈ రౌడీ జంట చేసిన పనికి షాక్‌ అవ్వాల్సిందే

Rowdy Couple Escaped With Car in Yalahanka - Sakshi

సాక్షి, బెంగళూరు: కారు డ్రైవర్‌కు మద్యం తాగించి కారుతో పరారైన రౌడీషీటర్‌ మేకె మంజ (27), అతని భార్య వేదవతి అలియాస్‌ జ్యోతి (25)ని యలహంక ఉపనగర పోలీసులు అరెస్టు చేశారు. డిసిపి అనూప్‌ శెట్టి తెలిపిన మేరకు వీరు ఇటీవల రాత్రి 10.30 సమయంలో నాగేనహళ్లి గేట్‌ దగ్గర ఓలా కార్‌ను బుక్‌ చేసి నగరంలోని వివిధ ప్రదేశాలు తిరిగారు. డ్రైవర్‌ శివశంకర్‌తో మంచిగా మాట్లాడుతూ డాబాలో పార్టీ చేసుకుందామని తీసుకెళ్లి అతనికి ఫుల్లుగా మద్యం తాగించారు.

మత్తులో డ్రైవర్‌ కారులో పడుకుని ఉండగా మంజ తాళాలు తీసుకుని నడుపుకొంటూ వెళ్లి రాజనుకుంటె దగ్గర డ్రైవర్‌ను బయటికి తోసేసి, అతని మొబైల్‌ను తీసుకుని ఉడాయించారు. మత్తు నుంచి తేరుకున్న డ్రైవర్‌ యలహంక ఉపనగర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గాలింపు జరిపి ఘరానా జంటను అరెస్టు చేసి కారు, రెండు మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. మంజపై హత్య, హత్యాయత్నం, దోపిడీ కేసులు ఉన్నాయి. 

చదవండి: (లేవరా.. ఒక్కసారి నన్ను చూడరా!)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top