విషాదం: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం

సాక్షి, కర్నూలు: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. గూడూరు సమీపంలో ఓ కరెంట్ సబ్ స్టేషన్ దగ్గర బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న ట్రాక్టర్, బైక్ పరస్పరం ఢీకొనడంతో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. పత్తి తీసేందుకు ట్రాక్టర్‌లో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. మృతులు బ్రాహ్మణ దొడ్డి గ్రామంలోని ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి