యూట్యూబ్ వీడియోలు చూసి అబార్షన్‌.. వికటించడంతో..

Rape Victim Hospitalised Trying To Abort Foetus Watching YouTube Videos - Sakshi

ముంబై: యూట్యూబ్ వీడియోలను చూస్తూ ఇంట్లోనే ‍స్వయంగా అబార్షన్ చేయడానికి యత్నించిన ఓ యువతికి ఆరోగ్యం క్షీణించి ఆస్పత్రి పాలైంది. మ‌హారాష్ట్ర నాగ‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. య‌శోధ‌ర న‌గ‌ర్‌కి చెందిన సోహెబ్ ఖాన్‌(30), బాధితురాలు 2016 నుంచి ప్రేమించుకుంటున్నారు. ఈ క్ర‌మంలో పెళ్లి చేసుకుంటాన‌ని యువతిని న‌మ్మించి ఆమెపై ప‌లుమార్లు అత్యాచారానికి పాల్ప‌డ్డాడు.

అయితే ఇటీవల తను గ‌ర్భం దాల్చడంతో విష‌యం తెలుసుకున్న ఖాన్‌ ఆమెను అబార్షన్‌ చేసుకోవాలని కోరాడు. ఇందుకు అబార్ష‌న్ ఎలా చేస్తారో, లేదా గ‌ర్భ‌స్రావం కోసం ఏ మందులు వాడాలో యూట్యూబ్‌లో వీడియోలు ఉంటాయని వాటిని చూసి తెలుసుకోవాల‌ని సోహెబ్ ఆమెకు సూచించాడు. అత‌ని బలవంతం మీద యూట్యూబ్ వీడియోలు చూసి ఆమె సొంతంగా అబార్ష‌న్‌కు య‌త్నించింది. దీంతో ఆమెకు తీవ్ర ర‌క్తస్రావం కావ‌డంతో చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. పోలీసులకు ఈ విషయం తెలియడంతో సోహెబ్ ఖాన్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

చదవండి: రూటు మార్చిన మోసగాళ్లు.. జర జాగ్రత్త!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top