లైంగిక దాడి ముద్దాయికి 25 ఏళ్ల శిక్ష | punishment for sexual assault in andhra pradesh | Sakshi
Sakshi News home page

లైంగిక దాడి ముద్దాయికి 25 ఏళ్ల శిక్ష

Published Fri, Nov 29 2024 5:27 AM | Last Updated on Fri, Nov 29 2024 5:27 AM

punishment for sexual assault in andhra pradesh

విశాఖ–లీగల్‌: వావి వరసలు మరిచి వరుసకు కూతురయ్యే చిన్నారిపై  లైంగిక దాడికి పాల్పడిన సవతి తండ్రికి 25 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ నగరంలోని పోక్సో ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జి.ఆనంది గురువారం తీర్పునిచ్చారు. జైలు శిక్షతోపాటు రూ.50 వేల జరిమానా విధించారు. ప్రభుత్వం రూ.4 లక్షలు బాలికకు పరిహారంగా చెల్లించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ బీవీఆర్‌ మూర్తి అందించిన వివరాలు.

పశ్చిమగోదావరి జిల్లా రాజఒమ్మంగి మండలం పాక గ్రామానికి చెందిన కుర్ర ఇమాన్యుయేల్‌ ప్రస్తుతం ఏఎస్‌ఆర్‌ జిల్లా  లోతుగడ్డ పంచాయతీ మేడూరు గ్రామంలో ఉంటున్నాడు. వృత్తి రీత్యా అతడు చర్చి ఫాదర్‌. బాధితురాలి తల్లి నందినికి ఆయన రెండో భర్త. నిందితుడు రోజూ కొంతమందితో అడవిలోని మోదుగ ఆకులు ఏరించి, పట్టణ ప్రాంతాలకు విక్రయించేవా డు.  2021 ఆగస్టు 26 మధ్యాహ్నం 12 గంటల సమయంలో అడవిలోని ఒక నిర్జన ప్రదేశంలో నందిని కుమార్తెపై అతి కిరాతకంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి   పైవిధంగా శిక్ష విధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement