ఈజీ మనీ కోసం జూనియర్‌ ఆర్టిస్ట్‌లతో.. | Prostitution Gang Busted In Hyderabad Lodge | Sakshi
Sakshi News home page

లాడ్జిలో జూనియర్‌ ఆర్టిస్ట్‌లతో వ్యభిచారం

Aug 26 2020 8:40 PM | Updated on Aug 26 2020 8:58 PM

Prostitution Gang Busted In Hyderabad Lodge - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఈజీ మనీ కోసం లాడ్జిలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టయింది. లాడ్జి నిర్వాహకుడితో పాటు మరో ఎనిమిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంత కాలంగా జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధి, శాపూర్ నగర్‌లోని రాఘవేంద్ర లాడ్జి‌లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం జరుగుతోందనే పక్కా సమాచారంతో నిఘా వేసిన జీడిమెట్ల పోలీసులు మంగళవారం రాత్రి లాడ్జి‌పై దాడులు నిర్వహించారు. నాలుగు గదులలోని నలుగురు కస్టమర్లు 1) దనం సంపత్, 2) ఒగ్గు ఓబిలాష్, 3) మేరుగు సురేష్, 4) నర్రా రాజ్ కుమార్‌లతో పాటు నిర్వాహకుడు సత్యనారాయణ ఎలియాస్ రాజేష్‌ను.. మరో నలుగురు మహిళలు 1) శ్రీమతి యెడిగంటి అమన్, 2) మహాతో రాధా, 3) షేక్ సానియా, 4) షేక్ షభానాలను అదుపులోకి తీసుకున్నారు. ( సీక్రెట్‌ రూంలో సెక్స్‌ రాకెట్‌)

పట్టుబడ్డ మహిళల్లో షేక్ హసీనా, షేక్ షభానాలు సినీ జూనియర్ ఆర్టిస్టులు కాగా, కస్టమర్ నర్రా రాజ్ కుమార్‌ వీఆర్‌ఓగా పని చేస్తున్నాడు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నామని జీడిమెట్ల పీఎస్‌ సీఐ బాల రాజు తెలిపారు. కరోనా ఉన్నందున లాడ్జ్ నడవక పోవడంతో డబ్బుల కోసం లాడ్జిలో వ్యభిచారం చేయిస్తున్నానని నిర్వాహకుడు సత్యనారాయణ ఎలియాస్ రాజేష్ తెలిపాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement