సీక్రెట్‌ రూంలో సెక్స్‌ రాకెట్‌ | Prostitution Racket Busted In Coimbatore | Sakshi
Sakshi News home page

సీక్రెట్‌ రూంలో సెక్స్‌ రాకెట్‌

Aug 22 2020 5:23 PM | Updated on Aug 22 2020 5:47 PM

Prostitution Racket Busted In Coimbatore - Sakshi

సీక్రెట్‌ రూంను పరిశీలిస్తున్న పోలీసులు

చెన్నై : కోయంబత్తూరులో సీక్రెట్‌ రూమ్‌ సెక్స్‌ రాకెట్‌ గుట్టు రట్టయింది. బుధవారం సెక్స్‌ రాకెట్‌ నిర్వహకులిద్దర్ని పోలీసులు అరెస్ట్‌ చేయటంతో పాటు ఓ మహిళను సంరక్షించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బుధవారం కోయంబత్తూరు పోలీసులు వ్యభిచారం జరుగుతోందన్న సమాచారంతో మెట్టుపాళియంలోని శరణ్యా లాడ్జిలో సోదాలు నిర్వహించారు. అన్ని గదులను వెతికినప్పటికి ఎలాంటి లాభం లేకపోయింది. అయితే ఓ గదిలో వారికి రెండు పెద్ద అద్దాలు కనిపించాయి. అవి రెండు ఎదురెదురుగా ఉన్నాయి. (సీఎం పర్సనల్‌ సెక్రటరీనంటూ..)

దీంతో అనుమానం వచ్చిన వారు అద్దాలను కదిపి చూశారు. ఓ అద్దం లోపలికి తెరుచుకోవటంతో అక్కడ ఓ చిన్న గది దర్శనమిచ్చింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. లోపల దాక్కుని ఉన్న బెంగళూరుకు చెందిన 22 ఏళ్ల మహిళను అక్కడినుంచి సంరక్షణా గృహానికి తరలించారు. సీక్రెట్‌ రూంలో సెక్స్‌ రాకెట్‌ నిర్వహిస్తున్న ఇ‍ద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement