రెండున్నర ఎకరాల కోసం నలుగురు బలి 

Property Dispute: Four Killed In Karnataka - Sakshi

యశవంతపుర: భూ వివాదంలో దాయాది కుటుంబాల ఘర్షణలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన కర్ణాటకలో హాసన్‌ జిల్లా హొళె నరసిపుర తాలూకా మారగౌడనహళ్లిలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది. మల్లేశ్, స్వామిగౌడ దాయాదులు. రెండున్నర ఎకరాల పొలంపై వీరిద్దరికీ కొన్నేళ్ల నుంచి కోర్టులో కేసు నడుస్తుండగా ఇటీవల మల్లేశ్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనితో మల్లేశ్‌ కొడుకు బసవరాజు సోమవారం దుక్కి చేయడానికి వెళ్లాడు. స్వామిగౌడ కొడుకు పాపన్న, ప్రదీప, శశి అతన్ని అడ్డుకుని పంపేశారు. దీనిపై సోమవారం మధ్యాహ్నం ఇరువర్గాలు ఇళ్ల వద్ద కట్టెలు, కత్తులతో కొట్లాటకు దిగారు. ఈ దాడిలో మల్లేశ్‌ (60) అతని బంధువు మంజేశ (35), అల్లుడు రవి (35)తోపాటు స్వామిగౌడ కొడుకు పాపన్న (42)చనిపోయారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top