పరీక్షలు రాయాలి.. బెయిల్‌ వచ్చిందని తెలియక విచారణ ఖైదీ ఆత్మహత్య | Prisoner Suicide Over Not Permits To Write Exams Karnataka | Sakshi
Sakshi News home page

పరీక్షలు రాయాలి.. బెయిల్‌ వచ్చిందని తెలియక విచారణ ఖైదీ ఆత్మహత్య

Apr 9 2022 4:25 PM | Updated on Apr 9 2022 4:50 PM

Prisoner Suicide Over Not Permits To Write Exams Karnataka - Sakshi

యశవంతపుర(బెంగళూరు): బెయిల్‌ మంజూరైన విషయం తెలియక గదగ సబ్‌ జైల్‌లో ఒక విచారణ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గదగ్‌ తాలూకా అడవి సోమాపుర తండా నివాసి రాజు లమాణి(19) ద్వితీయ పీయూసీ చదివేవాడు. అదే కాలేజీలో ప్రథమ పీయూసీ చదివే విద్యార్థినిని ప్రేమించాడు. ఇటీవల ఇద్దరూ బెంగళూరు, గోవా వెళ్లారు. అమ్మాయి కనిపించలేదని  తల్లిదండ్రులు గదగ గ్రామీణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు రాజు లమాణిని  పోక్సో చట్టం కింద అరెస్ట్‌ చేసి గదగ సబ్‌ జైల్‌కు తరలించారు. పరీక్షలు రాయటానికి  బెయిల్‌ వస్తుందని ఎదురు చూశాడు. గురువారం సాయంత్రం బెయిల్‌ దొరికింది. ఈ విషయాన్ని న్యాయవాది జైలు అధికారులకు చెప్పేందుకుఫోన్‌ చేశారు. అయితే అక్కడ ఎవరూ ఫోన్‌ ఎత్తలేదు. బెయిల్‌ మంజూరు విషయం తెలియక రాజు లమాణి మనో వేదనతో శుక్రవారం తెల్లవారుజామున కిటికీకి టవల్‌తో ఉరి వేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తులో ఉంది.

చదవండి: వివాహేతర సంబంధం..భార్య, అత్త, ప్రియుడు, మరో మిత్రుడితో కలిసి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement