హైదరాబాద్‌: స్పా సెంటర్ల మాటున గలీజు దందా! | Police Raid On Spa Centres In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌: స్పా సెంటర్ల మాటున గలీజు దందా!

Aug 18 2024 3:34 PM | Updated on Aug 18 2024 5:35 PM

Police Raid On Spa Centres In Hyderabad

నగరంలో స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచార దందా యథేచ్ఛగా సాగుతోంది. చందానగర్‌లో స్పా కేంద్రాలపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. నలుగురు మహిళలు, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు.

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో స్పా సెంటర్ల ముసుగులో వ్యభిచార దందా యథేచ్ఛగా సాగుతోంది. చందానగర్‌లో స్పా కేంద్రాలపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించారు. నలుగురు మహిళలు, ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు కేపీహెచ్‌బీలోని సెలూన్‌ షాప్‌పై పోలీసులు దాడులు చేయగా.. సెలూన్‌, స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు బట్టబయలలైంది. ముగ్గురు యువతులు, ఇద్దరు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార కూపాలుగా మారిన స్పా సెంటర్లపై పోలీసులు దాడులు కొనసాగిస్తున్నారు. అనుమతులు లేకుండా నడుస్తున్న స్పా సెంటర్లనే కాకుండా.. వాటిల్లో వ్యభిచారం కోసం ప్రత్యేక గదుల్ని ఏర్పాటు చేయడాన్ని పలు స్పా సెంటర్లలో గుర్తించారు.

గత నెలలో ఎస్‌ఆర్‌ నగర్‌, పంజాగుట్ట, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌ స్టేషన్ల పరిధిలో లైసెన్లు లేకుండా నిర్వహిస్తున్నారని సమాచారంపై దాడులు చేశారు. జీహెచ్‌ఎంసీ లైసెన్స్‌లతో పాటు సీసీ కెమెరాల డీవీఆర్‌లు, ప్రొఫెషనల్‌ థెరపిస్ట్‌లు లేకపోవడం, కస్టమర్ల ఎంట్రీ రిజిస్ట్రర్‌ సైతం లేవని తేలింది. అలాగే.. మార్గదర్శకాలు ఫాలో కాకుండా మహిళలతో క్రాస్‌ మసాజ్‌ చేస్తూ చట్టవిరుద్ధమైన పనులు చేస్తున్నట్లు గుర్తించారు
 

 

 

Advertisement
 
Advertisement
Advertisement