పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మధ్య రాచుకున్న రగడ

Pawan Kalyan Fans Attacks On Constable At A Theatre In Andhrapradesh - Sakshi

తీవ్ర గాయాలపాలైన కానిస్టేబుల్‌, ఆసుపత్రికి తరలింపు

సాక్షి, అనంతపురం : పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్స్‌ సృష్టించిన వీరంగంలో ఓ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన అనంతపురంలోని నార్పలలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. శ్రీనివాస డీలక్స్ థియేటర్లో వకీల్ సాబ్ సినిమా సెకండ్ షోలో పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య ఘర్షణ నెలకొంది. సీన అనే వ్యక్తి తాగిన మైకంలో ముందు సీట్లో కూర్చున్న వ్యక్తిపై వాటర్ ప్యాకెట్ విసిరేయడంతో అతని ఫోన్‌ తడిచిపోయింది. వాటర్ ప్యాకెట్‌తో మొదలైన గొడవ  కొట్టుకునేదాకా చేరింది.

మద్యం మత్తులో ఇద్దరు యువకులు పరస్పరం దాడి చేసుకుంటుండగా థియేటర్‌ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో సీన అనే పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్‌ ‌ పోలీసులపై కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో ఓ కానిస్టేబుల్‌కు తీవ్రగాయాలు కావడంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 

చదవండి : షూటింగ్‌ : అలాంటి సీన్లు చేయడానికి నో పర్మిషన్ 
'పుష్ప'‌పై కాంట్రవర్సీ.. కాపీ కొట్టారంటూ నెటిజన్లు ఫైర్‌

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top