కొడుకును కొట్టి చంపిన తల్లిదండ్రులు 

Parents who beat their son to death - Sakshi

ఆస్తి పంపకాల్లో గొడవలు 

వెల్గటూర్‌(ధర్మపురి): కొడుకు వేధింపులకు విసిగి వేసారిన ఓ దంపతులు అతడిని కొట్టి చంపారు. జగి త్యాల జిల్లా వెల్గటూర్‌ మండలం రాంనూర్‌ గ్రామంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకార.. రాంనూర్‌కు చెందిన కొదురుపాక భూమయ్య–రాజమ్మ దంపతులు. వీరికి మహేశ్‌ (35)అనే ఒక కుమారుడితోపాటు ఓ కుమార్తె ఉన్నారు.

భూమయ్య సింగరేణి సంస్థలో కార్మికుడిగా పనిచేస్తూ గోదావరిఖనిలో నివాసం ఉండేవాడు. ఉద్యోగ విరమణ చేశాక  స్వగ్రామం రాంనూర్‌ వచ్చి స్థిరపడ్డాడు. ఆస్తి పంపకాల విషయంలో  తల్లిదండ్రులు, భార్యతో మహేశ్‌ గొడవపడుతున్నాడు. ఈనెల 20న తనకు రూ.200 కావాలని తండ్రి భూమయ్యను మహేశ్‌ అడిగాడు.

అయితే భూమయ్య ఇవ్వకపోవడంతో గొడవకు దారితీసింది. గొడవ పెద్దది కా వడంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు, కౌలు దారు శేఖర్‌తో కలసి మహేశ్‌ను తీవ్రంగా కొట్టారు. ఈ దాడి లో అతని కాళ్లు, చేతులు విరిగి తీవ్రరక్తస్రావమైంది.  తొ లుత జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తర్వాత ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మహేశ్‌ అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top