ఆన్‌లైన్ సెక్స్ రాకెట్.. నిర్వాహకుడిపై పీడీయాక్ట్ | Online racket busted in Hyderabad | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్ సెక్స్ రాకెట్.. నిర్వాహకుడిపై పీడీయాక్ట్

Aug 25 2020 4:05 PM | Updated on Aug 25 2020 4:12 PM

Online racket busted in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న కీసరకు చెందిన వంశీరెడ్డిపై రాచకొండ పోలీసులు పీడీయాక్ట్ నమోదు చేశారు. ఉద్యోగం పేరుతో పశ్చిమ బెంగాల్ నుంచి అందమైన అమ్మాయిలను హైదరాబాద్‌కు తీసుకొచ్చి వారితో బలవంతంగా వ్యభిచారం చేయించేవాడు. ఆన్‌లైన్లో అమ్మాయిల ఫోటోలను పోస్ట్ చేసి విటులను ఆకర్షించేవాడు. నచ్చిన అమ్మాయిను వారి వద్దకు పంపించి రూ.వేలల్లో డబ్బు తీసుకునేవాడు. ఈ వ్యవహారం మొత్తం ఆన్‌లైన్‌లోనే సాగిపోయేది.(ఏడాదిన్నర చిన్నారి కిడ్నాప్‌ కేసు విషాదాంతం!)

దీనిపై సమాచారం అందుకున్న రాచకొండ పోలీసులు వీరి స్థావరంపై దాడి చేసి అమ్మాయిలను రక్షించారు. వంశీరెడ్డితో పాటు అంజలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. యువతుల అక్రమ రవాణాలో కీలకంగా వ్యవహరించిన వంశీరెడ్డిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని రాచకొండ పోలీస్‌ కమిషనర్ మహేష్ భగవత్ ఆదేశించారు. దీంతో పోలీసులు అతడిపై అందుకు అనుగుణంగా చర్యలు తీసుకున్నారు.(పీఎన్‌బీ స్కాం : నీరవ్ భార్యకు రెడ్ కార్నర్ నోటీసు)

Advertisement
 
Advertisement
Advertisement