నిలోఫర్‌లో పసికందు కిడ్నాప్‌ | One-month-old baby abducted from Niloufer hospital | Sakshi
Sakshi News home page

నిలోఫర్‌లో పసికందు కిడ్నాప్‌

Nov 24 2024 8:09 AM | Updated on Nov 24 2024 8:09 AM

One-month-old baby abducted from Niloufer hospital

బుర్ఖాలో వచ్చిన..ఆటో ఎక్కి పరార్‌ 

డిశ్చారై ఇంటికి వెళ్లే సమయంలో ఘటన  

నాంపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన తల్లి

నాంపల్లి: నాంపల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నిలోఫర్‌ ఆస్పత్రి వద్ద ఓ పసికందు కిడ్నాప్‌కు గురైంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..జహీరాబాద్‌కు చెందిన హసీనాబేగం, గఫార్‌ దంపతులకు నెల రోజుల క్రితం ఒక మగ శిశువు జని్మంచారు. శిశువుకు పచ్చ కామెర్ల వ్యాధి సోకింది. దీంతో బాబును నిలోఫర్‌ ఆసుపత్రిలో చేర్పించారు. వ్యాధి నుంచి కోలుకున్న శిశువును శనివారం డిశ్చార్జ్‌ చేశారు. డిశ్చార్జ్‌ అయ్యాక శిశువు తల్లి, శిశువు అమ్మమ్మ పైఅంతస్తులోని వార్డు నుంచి కిందకు చేరుకున్నారు. 

మందులు తీసుకునేందుకు తల్లి కౌంటర్‌ వద్దకు వెళ్లింది. ఆ సమయంలో శిశువు అమ్మమ్మ చేతిలో ఉంది. ఇదే సమయంలో బుర్ఖా ధరించిన ఓ మహిళ అక్కడకు చేరుకుంది. తాను ఆసుపత్రి సిబ్బంది అని మాయమాటలు చెప్పి..వృద్ధురాలి చేతిలో ఉన్న శిశువును తీసుకుంది. కాసేపు ఎత్తుకుని మాట్లాడిస్తున్నట్లు నటిస్తూ రోగులు ఉన్న గుంపులోకి వెళ్లింది. అక్కడ నుంచి ని్రష్కమించిన ఆ మహిళ మళ్లీ కనిపించలేదు. దీంతో  తల్లి, బంధువులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. శిశువు ఆచూకీ కోసం ఆసుపత్రి ప్రాంగణమంతా తిరిగినా ప్రయోజనం లేకుండా పోయింది. 

చివరకు చేసేదేమి లేక నాంపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వెంటనే పోలీసులు సీసీ పుటేజీ పరిశీలించారు. ఆసుపత్రి నుంచి శిశువును ఎత్తుకొని బయటకు వెళ్లిన మహిళ బుర్ఖాలో వచి్చనట్లు పోలీసులు గుర్తించారు. ఆటోలో వెళ్లిన మహిళ కొంతదూరం వెళ్లాక ఆటో దిగి మరో  ద్విచక్ర వాహనాన్ని ఎక్కి పారిపోయింది.  

    

Advertisement
 
Advertisement
Advertisement