హత్య చేసి తప్పించుకోవాలనుకుంది..తల్లిని పట్టించిన 13 ఏళ్ల కూతురు

Nurse Allegedly Kills Husband Her Daughter Witness Police Arrested - Sakshi

భర్తను చంపి ఏమి ఎరుగనట్టు ఆస్పత్రికి తీసుకవచ్చింది ఓ నర్సు. ఆత్యహత్య చేసుకుని చనిపోయాడంటూ వైద్యులను నమ్మించేందుకు యత్నించి కటకటాల పాలయ్యింది. ఈ ఘటన ఘజియాబాద్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే....పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..కవిత అనే మహిళ నర్సుగా పనిచేస్తోంది. ఆమె నవంబర్‌ 29న భర్తతో గోడవ పడి ఆవేశంలో చంపేసింది. ఆ తర్వాత ఏమి తెలియనట్లు తాను పనిచేసే ఆస్పత్రికే తీసుకువచ్చింది. వైద్యులకు భర్త దుప్పటితో ఫ్యాన్‌కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లు చెప్పింది. దీంతో ఆస్పత్రి వర్గాలు పోలీసులకు సమాచారం అందించి పోస్ట్‌మార్టం కార్యక్రమాలు నిర్వహించారు.

పోస్ట్‌మార్టం నివేదికలో సదరు వ్యక్తి గొంతుపై ఊపిరాడకుండా చేసిన గుర్తులు ఉన్నట్లు పేర్కొంది. దీంతో పోలీసులు అనుమానంతో కవితను గట్టిగా విచారించగా...తన భర్త మహేశ్‌ తాగి వచ్చి తరుచు కొడుతూ ఉండేవాడని చెప్పింది. ఇలానే నవంబర్‌29న ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, దీంతో తన భర్త నిద్రపోతున్నప్పుడూ గొంతు నులిమి చంపినట్లు పేర్కొంది.

అంతేగాదు ఆమె 13 ఏళ్ల కూతుర్ని కూడా విచారించగా...వాళ్ల అమ్మ కవిత తన తండ్రి నోటిని మూసి చంపుతుండటం చూసినట్లు తెలిపింది. విచారణలో భాగంగా ఆమె ఫోన్‌ని కూడా తనిఖీ చేయగా ఆమె ఆస్పత్రిలో ఇన్సూరెన్స్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసే వినయ్‌ శర్మతో ఆమెకు సంబంధం ఉందని తేలింది. ఈ హత్యలో వినయ్‌ ప్రమేయం కూడా ఉ‍న్నట్లు చెప్పే.. వాట్సప్‌ చాట్‌లు, ఆడియో రికార్డులు  ఉన్నాయని పోలీసులు చెప్పారు. దీంతో అతన్ని కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు తెలిపారు.

(చదవండి: ఇల్లరికపు అల్లుడు షాకింగ్‌ ట్విస్ట్‌.. భార్యకు వివాహేతర సంబంధం ఉందని..)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top