వివాహం జరిగిన నెల రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్య | newly married woman committed suicide | Sakshi
Sakshi News home page

వివాహం జరిగిన నెల రోజులకే ఓ నవ వధువు ఆత్మహత్య

Jun 4 2023 12:25 PM | Updated on Jun 4 2023 12:25 PM

newly married woman committed suicide - Sakshi

హైదరాబాద్: వివాహం జరిగిన నెల రోజులకే ఓ నవ వధువు సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వసంత్‌నగర్‌లో నివసించే నరేష్‌ గౌడ్‌కు గాజుల రామారంలో నివాసం ఉండే నందిని (23)కి నెల రోజుల క్రితం వివాహమైంది. భర్త ఇంటి వద్దనే ఉన్న నందిని శనివారం రాత్రి 7 గంటల సమయంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వా«దీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. వధువు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని వ్యక్తిగత కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. దర్యాప్తులో పూర్తి వివరాలు తెలుస్తాయని ఎస్సై రామ్మోహన్‌ రెడ్డి వివరించారు. 

Advertisement
 
Advertisement
Advertisement