‘నాన్న జాగ్రత్త.. టైమ్‌కి మందులు వేసుకో’ | Narsingi Giri Giri Gadda Man Ends His Life After Talking With His Father | Sakshi
Sakshi News home page

‘నాన్న జాగ్రత్త.. టైమ్‌కి మందులు వేసుకో’

Aug 7 2021 3:55 PM | Updated on Aug 7 2021 4:00 PM

Narsingi Giri Giri Gadda Man Ends His Life After Talking With His Father - Sakshi

మణికొండ: ముందు రోజు రాత్రి ఫోన్‌లో నీ ఆరోగ్యం సరిగా చూసుకో.. మందులు సమయానికి వేసుకో అని తండ్రికి జాగ్రత్తలు చెప్పి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని గిరిగిరిగడ్డలో చోటు చేసుకుంది. నార్సింగి సెక్టార్‌ ఎస్సై బలరాంనాయక్‌ తెలిపిన వివరాల ప్రకారం... జనగాం జిల్లా కుర్చెపల్లి గ్రామానికి చెందిన పోరెడ్డి తిరుపతిరెడ్డి హెచ్‌ఎండీఏలో 8ఏళ్లుగా సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు.  గిరిగిరిగడ్డలో ఓ గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు.  

గురువారం రాత్రి తన తండ్రి వెంకట్‌రెడ్డికి ఫోన్‌ చేసి ఆరోగ్యం సరిగా చూసుకోవాలని సూచించి ఫోన్‌ పెట్టేశాడు. రాత్రి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు  ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.   

Advertisement
 
Advertisement
Advertisement