మహిళ వెనుక వెళ్లి.. డ్రెస్‌ను పైకెత్తి | Woman Harassed In Manikonda Alkapur Township, Incident Sparks Concern Over Safety And CCTV Monitoring, Watch Video Inside | Sakshi
Sakshi News home page

మహిళ వెనుక వెళ్లి.. డ్రెస్‌ను పైకెత్తి

May 20 2026 7:09 AM | Updated on May 21 2026 2:09 PM

Shocking Incident In Manikonda

హైదరాబాద్‌: ఇటీవల నార్సింగి సైకిల్‌ ట్రాక్‌లో జాగింగ్‌ చేస్తున్న యువతిని చూస్తూ ఓ వ్యక్తి అనుచితంగా ప్రవర్తించడం మరచిపోకముందే అలాంటిదే మరో ఘటన నెక్నాంపూర్‌ డివిజన్‌ అలకాపూర్‌ టౌన్‌షిప్‌లో చోటుచేసుకుంది. ఈ నెల 14వ తేదీన జరిగిన ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

స్థానికులు, నార్సింగి ఎస్‌ఐ సరిత తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ రోడ్‌ నం. 4లో మధ్యాహ్నం వేళ కూతురును ఎత్తుకుని వెళ్తోంది. ఓ యువకుడు నక్కినక్కి వచ్చి వెనకనుంచి మహిళ డ్రెస్‌ను పైకెత్తాడు. అకస్మాత్తు పరిణామంతో నివ్వెరపోయిన మహిళ గట్టిగా అరిచింది. దీంతో నిందితుడు పారిపోయాడు. 

ఇదంతా సీసీ కెమెరాలో రికార్డైంది. కొందరు దాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరలైంది. విషయం పోలీసులకు చేరడంతో బాధిత మహిళను గుర్తించి ఆమె నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చేశారు. అసభ్యంగా ప్రవర్తించిన యువకుడి కోసం గాలింపు చేపట్టారు. కాగా, ఇలాంటివి జరగకుండా పోలీసులు గస్తీ పెంచాలని, కాలనీల్లో సీసీ కెమెరాలన్నింటినీ పనిచేసేలా చూడాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement