బెంగళూరు టు హైదరాబాద్‌ | Narsingi Drug Case: Accused Lavanya Came To Hyderabad For Higher Studies And Became A Music Teacher - Sakshi
Sakshi News home page

Narsingi Drugs Case: బెంగళూరు టు హైదరాబాద్‌

Published Wed, Jan 31 2024 5:37 AM

Narsingi Drug Case: Accused Lavanya Is A Music Teacher - Sakshi

మణికొండ: లావణ్య ఫోన్‌ కాంటాక్ట్‌ లిస్ట్, కాల్‌ డేటా, సోషల్‌ మీడియా చాట్‌ల ఆధారంగా డ్రగ్స్‌ రాకెట్‌పై నార్సింగి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. లావణ్యతోపాటు ఉనీత్‌రెడ్డిలపై 2022లో గుంటూరు జిల్లా పట్టాభిపురం, 2023లో మోకిల పోలీస్‌స్టేషన్లలో డ్రగ్స్‌ కేసులు నమోదైన విషయాన్ని పోలీసులు గుర్తించారు. లావణ్యకు పలువురు టాలీవుడ్‌ నటులు, వీఐపీలతో పరిచయాలు ఉన్నట్టు గుర్తించారు.

లావణ్య, ఉనీత్‌రెడ్డిలు బెంగళూరులో రూ.1,500లకు గ్రాము చొప్పున కొనుగోలు చేసి హైదరాబాద్‌లో రూ.6,000 వరకు విక్రయిస్తున్నట్టు సమాచారం. విజయవాడ నుంచి ఉన్నత చదువులకు హైదరాబాద్‌ వచ్చి హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చేసిన లావణ్య, ఆ రంగంలో స్థిరపడకుండా..మ్యూజిక్‌ నేర్చుకుంది. అదే క్రమంలో షార్ట్‌ ఫిలింలు, పలు చిన్న సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టీస్ట్‌గా అవకాశాలు దక్కించుకుంది.

మరిన్ని సినిమా చాన్స్‌ల కోసం ప్రయత్నిస్తోంది. ఉనీత్‌రెడ్డి కూడా షార్ట్‌ ఫిల్మ్‌లలో నటించాడు. ఉనీత్‌రెడ్డి బెంగళూరు నుంచి డ్రగ్స్‌ తెప్పించి లావణ్య,తోపాటు తన గర్ల్‌ ఫ్రెండ్‌. తదితరులు ఇచ్చేవాడు. వారు వాడటమే కాకుండా, ఇతరులకు విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. లావణ్యకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. ఆమెను తమ కస్టడీకి తీసుకొని లోతుగా విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్‌ దాఖలు చేశారు. కోర్టు నుంచి అనుమతి రాగానే పూర్తిస్థాయి విచారణ చేస్తే మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశముంది. ఉనీత్‌రెడ్డి పరారీలో ఉన్నాడని, అతడి ని పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement