అహం దెబ్బతిని.. | The mystery of the Kadtal double murders | Sakshi
Sakshi News home page

అహం దెబ్బతిని..

Jun 8 2024 5:07 AM | Updated on Jun 8 2024 5:07 AM

The mystery of the Kadtal double murders

వీడిన కడ్తాల్‌ జంట హత్యల మిస్టరీ 

ఏడుగురి అరెస్ట్‌... వివరాలు వెల్లడించిన శంషాబాద్‌ డీసీపీ  

శంషాబాద్‌: జంట హత్యల కేసు మిస్టరీ వీడింది. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్‌ చేశారు. ఆ వివరాలను శంషాబాద్‌ డీసీపీ నారాయణరెడ్డి వెల్లడించారు. కడ్తాల్‌ మండలం గోవిందాయపల్లికి చెందిన గుండమోనీ శివ (28) మియాపూర్‌లో చికెన్‌ దుకాణంలో పనిచేస్తున్నాడు. అదే గ్రామాని కి చెందిన శేషగిరి శివ (28) నగరంలోని గాయత్రీనగర్‌లో ఉంటూ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నా డు. అదే గ్రామానికి చెందిన రియల్‌ఎస్టేట్‌ వ్యాపారి జలకం రవికి వీరితో స్నేహం ఉంది. ముగ్గురూ బీజేవైఎంలో చురుగ్గా పనిచేశారు. 

శివ, శేషగిరి శివకు కొంతకాలం క్రితం రవితో మన స్పర్థలు రాగా, వారు కాంగ్రెస్‌లో చేరారు. దీంతో రవికి వీరికి దూరం పెరిగింది. దీనికితోడు ఈ నెల 4న కడ్తాల్‌లోని బట్టర్‌ఫ్లై వెంచర్‌లో రవి తన పుట్టినరోజు వేడుకలు చేసుకున్నాడు. ఆ 300 ఫొటోలు గోవిందాయిపల్లికి చెందిన వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేశాడు. దీనికి ఇద్దరు శివలు అభ్యంతరం చెబుతూ ఫొటోలు డిలేట్‌ చేసి, రవిని వాట్సాప్‌ గ్రూప్‌లో నుంచి తొలగించారు. దీంతో తనను అవమానించి, ప్రతిష్టకు భంగం కలిగించిన వారిని అంతం చేయాలని రవి నిర్ణయించుకున్నాడు. 

తన స్నేహితులైన పల్లె నాగరాజుగౌడ్, తలకొండ రాజు, జీలుకుంట్ల విజయ్, తిరు పతి జగదీశ్‌గౌడ్, నిట్ల ప్రవీణ్, వల్లేపు దాసు శేఖర్‌తో కలిసి హత్యకు ప్లాన్‌ చేశాడు. వారిద్దరు ఈ నెల 5న  ఓ వైన్స్‌ దుకాణంలో మద్యం తాగుతున్నారని తెలుసుకున్న రవి.. తన ఇన్నోవాలో ఆరుగురు స్నేహితులతో కలిసి అక్కడకు వెళ్లాడు. బలవంతంగా వారిని కారులో ఎక్కించుకొని బట్టర్‌ఫ్లై వెంచర్‌లో తాను అద్దెకుంటున్న గది వద్దకు తీసుకొచ్చి హతమార్చారు. ఆ తర్వాత గదికి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యారు. కేసు దర్యాప్తు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో మీర్‌పేట్‌ వద్ద ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement