ఎవరు చంపారో? ఎందుకు చంపారో?  | Mystery Body Of Young Man Found In Crop Fields In Kamareddy District | Sakshi
Sakshi News home page

ఎవరు చంపారో? ఎందుకు చంపారో? 

Feb 6 2022 3:13 AM | Updated on Feb 6 2022 3:13 AM

Mystery Body Of Young Man Found In Crop Fields In Kamareddy District - Sakshi

నాగిరెడ్డిపేట (ఎల్లారెడ్డి): కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం తాండూర్‌ గ్రామ శివారు లో శనివారం పంట పొలాల మధ్య రక్తపు మ డుగులో ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బాలుడు మండలంలోని అక్కంపల్లి గ్రామానికి చెందిన ఒడ్డెర సురేష్‌ (12)గా గుర్తించారు. అక్కంపల్లిలోని ఒడ్డెర రాములు, సాయవ్వ దంపతులకు ముగ్గురు కుమారులుండగా పెద్దవాడైన సురేష్‌ ఆరో తరగతి చదువుతున్నాడు.

సురేష్‌తో పాటు మరో కుమారుడిని ఇంటివద్ద తల్లి పోచవ్వతో ఉంచి రాములు, సాయవ్వ మరో కుమారునితో బతుకు దెరువు కోసం హైదరాబాద్‌ వెళ్లారు. ఈ క్రమంలో బాలుడు హత్యకు గురి కావడం స్థానికంగా కలకలం రేపింది. గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్యచేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలాన్ని ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్‌రెడ్డితోపాటు నాగిరెడ్డిపేట ఎస్‌ఐ ఆంజనేయులు పరిశీలించారు. శనివారం రాత్రి వరకు బాలుని మృతిపై స్పష్టత రాలేదు.

Advertisement
 
Advertisement
Advertisement