
సాక్షి, బనశంకరి(కర్ణాటక): ఎమ్మెల్యే అరవింద్ బెల్లద్ ఫోన్ ట్యాపింగ్ కేసు మలుపు తిరిగింది. బెల్లద్‌కు పరప్పన అగ్రహార జైలు లో ఉన్న యువరాజ్‌స్వామి నుంచి ఫోన్‌కాల్ రాలేదని విచారణలో తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన అర్చకుడు జితేంద్రనాద్ అనే వ్యక్తిని పోలీసులు ప్రశ్నించారు.
ఎమ్మెల్యేకు ఆయన ఫోన్ చేసింది నిజమేనని, అయితే పరిచయస్తుడేనని తేల్చారు. జైల్లో ఉండే యువరాజ్‌స్వామి అనే ఖైదీతో ఎలాంటి సంబంధం లేదని డీసీపీ అనుచేత్ నిర్వహించిన విచారణలో నిర్ధారించినట్లు తెలిసింది.