అసభ్య ప్రవర్తన.. నగ్నంగా నిందితుడి ఊరేగింపు  | Miscreant Behaved Rudely On Three Year Old Child | Sakshi
Sakshi News home page

చిన్నారిపై అసభ్య ప్రవర్తన.. నిందితుడికి గుణపాఠం

Oct 28 2020 9:01 AM | Updated on Oct 28 2020 12:18 PM

Miscreant Behaved Rudely On Three Year Old Child - Sakshi

సాక్షి, తణుకు (పశ్చిమగోదావరి జిల్లా): తణుకు పట్టణంలో అమానుషం చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించాడో దుర్మార్గుడు. పాతూరు ఎనిమిదో వార్డులో నివాసం ఉంటున్న చిన్నారి ఆడుకుంటూ ఉండగా ఆమెపై అమానుషంగా ప్రవర్తించాడు. జంగారెడ్డిగూడేనికి చెందిన అడపా వీరబ్రహ్మం మంగళవారం పాతూరులోని బంధువుల ఇంటికి వచ్చాడు.

ఫూటుగా మద్యం తాగి సమీపంలో ఆడుకుంటున్న చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించాడు. దీనిని గమనించిన స్థానికులు అతడిని తాళ్లతో కట్టి దేహశుద్ధి చేశారు. కొట్టుకుంటూ నగ్నంగా మున్సిపల్‌ కార్యాలయం వరకు ఊరేగించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని పట్టణ పోలీసు స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. చిన్నారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement