Mehul Choksi:అందుకే కిడ్నాప్‌ చేశారు, చోక్సీ వింత ఆరోపణలు

Mehul Choksi in return for vaccines makes wild allegation - Sakshi

ఆంటిగ్వా  అండ్‌  బార్బుడాకు  ఇండియా కరోనా వ్యాక్సిన్లు

వ్యాక్సీన్లకు బదులుగా నా కిడ్నాప్‌ : మెహుల్‌ చోక్సీ

సాక్షి, ముంబై: పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు కుంభకోణంలో ప్రధాన నిందితుడు, డైమండ్‌ వ్యాపారి మెహుల్ చోక్సీ తన కిడ్నాప్‌ వ్యవహారంపై మరోసారి కీలక   వ్యాఖ్యలు చేశారు. కరేబియన్‌ దేశానికి భారత్‌ కోవిడ్ -19 వ్యాక్సిన్లను అందించినందుకుగా ప్రతిగానే తనను కిడ్నాప్‌ చేసినట్టు ఆరోపించారు. ఆంటిగ్వా అండ్‌ బార్బుడాకు  ఇండియా కరోనా వ్యాక్సిన్లను ఎగుమతి చేయడాన్ని ప్రస్తావిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, చోక్సీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండియాలో  2019 లోక్‌సభ ఎన్నికల  సమయంలోనే  తన  అపహరణకు సంబంధించిన పుకార్లు తన చెవిన పడినట్టు చెప్పు​​​కొచ్చారు.  ఒక విమానం వచ్చిందని, చాలా మంది  ఫాలో అవుతున్నారనని తనను  బయటకు తీసుకెళ్ళి చంపేస్తారని చెప్పారని కూడా తెలిపారు.  రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్ (రా)  ఏజెంట్లు అని చెప్పుకుంటూ గుర్మిత్ సింగ్, గుర్జిత్ భండాల్ ఆంటిగ్వా బార్బుడా నుంచి తనను అపహరింకు పోయారని చెప్పారు.  వీరి గురించి తాను చాలా కథలు విన్నాననీ,  ప్రపంచవ్యాప్తంగా ద్వీపాలు, ప్రదేశాల చుట్టూనే ఉంటారని  చోక్సీ ఆరోపించారు.

కాగా సుమారు 14 వేల కోట్ల రూపాయల పీఎన్‌బీ స్కాం నిందితుడు చోక్సీ  2018 జనవరిలో భారత్‌ నుంచి  ఆంటిగ్వా అండ్ బార్బుడాకు పారిపోయి, అక్కడ తలదాచుకున్నాడు. అయితే ఇటీవల డొమినికాకు పారిపోతుండగా పోలీసులు అరెస్ట్‌ చేశారు.  డొమినికాలో దాదాపు 51 రోజుల కస్టడీ తర్వాత వైద్యకారణాలరీత్యా డొమినికా హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. చోక్సి ప్రస్తుతం ఆంటిగ్వా,  బార్బుడాలో ఉన్న సంగతి తెలిసిందే.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top