Married Woman Commits Suicide Over Husband Extra Marital Affair, Details Inside - Sakshi
Sakshi News home page

Karnataka: మరో మహిళతో వివాహేతర సంబందం.. భర్త దాష్టీకాన్ని తట్టుకోలేని భార్య.. 

Dec 21 2022 8:41 AM | Updated on Dec 21 2022 12:40 PM

married woman commits suicide over husband extra marital affair - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, బెంగళూరు(కృష్ణరాజపురం): భర్తకు మరో మహిళతో వివాహేతర సంబందం, పైగా కట్నం వేధింపులకు గురి చేయడంతో విరక్తి చెందిన మహిళ బిడ్డను చంపి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హోసకోటె తాలూకాలోని కల్కుంటి అగ్రహార  గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. శ్వేత (24),  ఏడాదిన్నర బాలుడు యక్షిత్‌ మృతులు. శ్వేతకు మూడేళ్ల కిందట రాకేష్‌ అనే యువకునితో పెళ్లయింది.

అతనికి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉండేది. దీనిపై చాలాసార్లు  భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. పెద్దలు వచ్చి రాజీ పంచాయతీలు చేశారు. అయినా వివాహేతర సంబంధం మానుకోలేదు. దీనికి తోడు పుట్టింటి నుంచి డబ్బు తేవాలని శ్వేతను వేధించేవాడు. ఇదంతా భరించలేక ఆమె బాలున్ని గొంతు పిసికి చంపి, తాను ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. అనుగొండనహళ్ళి పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు.     

చదవండి: (బెంగళూరులో విషాదం.. విగతజీవులుగా తల్లీ, కొడుకు కూతురు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement