భార్య దారుణ హత్య, కోమాలో భర్త.. ప్రేమ వ్యవహారమే కారణం!

Married Swapna Murder At Hyderabad Champapet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని చంపాపేట్‌లో వివాహిత స్వప్న హత్య కేసు తీవ్ర కలకలం సృష్టించింది. కాగా, ఈ కేసులో పోలీసులు దర్యాప్తును తీవ్రతరం చేశారు. దర్యాప్తులో భాగంగా స్వప్న హత్యకు ప్రేమ వ్యవహారమే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు. తెర మీదకు ప్రియుడు సతీష్‌ పేరు రావడంలో కేసు మరో మలుపు తిరిగింది. 

ఈ కేసుకు సంబంధించి వివరాల ప్రకారం.. మృతురాలు స్వప్న గతంలో సతీష్ అనే యువకుడిని ప్రేమించింది. కాగా, స్వప్నకు ప్రేమ్ అనే యువకుడితో వివాహం జరిగింది. అయితే స్వప్న వివాహం జరిగిన తరువాత కూడా మాజీ ప్రియుడు సతీష్‌తో కాంటాక్ట్‌లోనే ఉన్నది. సతీష్ చంపాపేట్‌లోని స్వప్న ఇంటికి తరుచూ వస్తూ పోతూ ఉండేవాడు. ఈ విషయం ప్రేమ్‌కు తెలియడంతో సతీష్‌తో ఇటీవల గొడవలు జరిగాయి. 

అయితే, నిన్న(శనివారం) ఉదయం 11:30 గంటలకు చంపాపేట్‌లోని స్వప్న ఇంటికి సతీష్‌ తన స్నేహితులతో కలిసి వచ్చాడు. ఈ సందర్భంగా తీవ్ర ఆగ్రహంతో ఉన్న సతీష్‌.. స్వప్నను దారుణంగా హత్య చేశాడు. అనంతరం, స్వప్న భర్త ప్రేమ్‌ను రెండవ అంతస్తు నుండి కిందకు నెట్టేసాడు. ఈ క్రమంలో ప్రేమ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రేమ్‌ ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో కోమాలో ఉన్నాడు. వైద్యులు చికిత్స అందిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ప్రేమ్ కుమార్ వాంగ్మూలాన్ని తీసుకుంటే కేసును ఛేదించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా అతను స్పృహలోకి ఎప్పుడు వస్తాడో తెలియరాలేదు. ఈ క్రమంలో స్వప్న తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఘోర రోడ్డు ప్రమాదం... భార్యా భర్తలు మృతి

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top