వైద్య సిబ్బందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు‌‌

Maoists Kidnap Three Medical Staff In Bijapur - Sakshi

సాక్షి, చర్ల: సరిహద్దు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లాలో మావోయిస్టులు ముగ్గురు వైద్య సిబ్బందిని కిడ్నాప్‌ చేశారు. గంగుళూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కామకనార్‌ గ్రామంలో గర్భిణులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించేందుకు మాస్టర్‌ ట్రైనర్‌ శారద వచ్చారు. ఈ క్రమంలో గురువారం రాత్రి హెల్త్‌ వర్కర్‌ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో మావోయిస్టులు అక్కడికి వచ్చారు. శారద, మరో ఇద్దరు హెల్త్‌ వర్కర్లను కిడ్నాప్‌ చేసి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఎస్పీ కమలోచన్‌ కాశ్యప్‌ ధ్రువీకరించారు. కాగా, వైద్య సిబ్బంది కిడ్నాప్‌తో బీజాపూర్‌లో కలకలం రేగింది.   

మావోయిస్టులను అరెస్టు చేయలేదు 
చర్ల: మావోయిస్టులను అరెస్టు చేసినట్లు సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని బస్తర్‌ రేంజ్‌ ఐజీ సౌందర్‌రాజ్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎదురుకాల్పుల తర్వాత కొందరు గ్రామస్తులు పోలీసులతో కలసి బేస్‌ క్యాంపు వరకు వచ్చారని, ఆ తర్వాత వారందరినీ వెంటనే తిరిగి వారి ఇళ్లకు పంపించామని తెలిపారు. ఎటువంటి ఆధారం లేకుండా ఇటువంటి తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదన్నారు.
చదవండి: రాకేశ్వర్‌ సింగ్‌ విడుదల అంత ఆషామాషీగా జరగలేదు

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top