ఆర్టీసీ బస్సుకు నిప్పంటించిన యువకుడు!

Man Tried To Fire RTC Bus Fire Tragedy In Prakasam - Sakshi

సాక్షి, కనిగిరి(ప్రకాశం): ఆర్టీసీ బస్సుకు ఓ యువకుడు పెట్రోల్‌ పోసి నిప్పంటించడంతో ప్రయాణికులు బెంబేలెత్తారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణంలోని పామూరు బస్టాండ్‌ సెంటర్‌లో గురువారం జరిగింది. వివరాలు.. వెలిగండ్ల మండలం మొగళ్లూరుకు చెందిన ఏడుకొండలు అనే యువకుడు పామూరు బస్టాండ్‌ సెంటర్‌లో కనిగిరి నుంచి పామూరు వెళ్లే ఆర్టీసీ బస్సుకు పెట్రోల్‌ పోసి నిప్పటించాడు. వెంటనే స్థానికులు అప్రమత్తమై మంటలు అదుపు చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు వచ్చి ఏడుకొండలును అదుపులోకి తీసుకున్నారు. అనుకోని ఘటనతో బస్సులో ఉన్న 28 మంది ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఈ విషయమై ఎస్‌ఐ రామిరెడ్డిని వివరణ కోరగా.. విచారణలో యువకుడు పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరిగాయని, త్వరలో జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని, వాటి ధరలు తగ్గిస్తుందని.. ఇలా పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడని తెలిపారు. అతనికి మతిస్థిమితం సరిగా లేనట్లు అనుమానిస్తున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరు పరుస్తామని ఎస్‌ఐ చెప్పారు.

     

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top