
జె.పంగులూరు: ప్రకాశం జిల్లా జే పంగులూరు మండలంలోని కొండమంజులూరు గ్రామంలో మంగళవారం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకుంది. కొండమంజులూరు గ్రామానికి చెందిన బొప్పుడి శివయ్య కుమార్తె బొప్పుడి మానస (26) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తోంది. ఆమెకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు సంబంధం ఖాయం చేసుకున్నారు. ఇది ఆమెకు ఇష్టం లేదు. దీంతో మంగళవారం చీరతో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసినట్టు తెలిపారు.
చేశారు.