వివాహేతర సంబంధాన్ని వదల్లేక.. నీవు లేక నేను లేనంటూ

Man Suicide With Extramarital Relation At Chennai - Sakshi

సాక్షి, చెన్నై : వివాహేతర సంబంధానికి స్వస్తి పలకలేక ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో యువకుడు మరణించాడు. వివాహిత ప్రాణాపాయం నుంచి బైటపడింది. ఎస్‌ఐ నాగేశ్వర్‌ కథనం ప్రకారం.. మండలంలోని తెల్లరాళ్లపల్లెకు చెందిన దిలీప్‌ కుమార్‌(22) అదే గ్రామానికి చెందిన 20 ఏళ్ల వివాహితతో సాన్నిహిత్యం పెంచుకున్నాడు. ఇది ఆమె భర్తకు తెలియడంతో అతను మందలించాడు. అయినా వీరి తీరు మారలేదు. ఈ నేపథ్యంలో మరోసారి తీవ్రంగా హెచ్చరించారు. దీంతో వారిద్దరూ ఆదివారం మధ్యాహ్నం అదృశ్యమయ్యారు.   (ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం; ఆరుగురు మృతి)

మండలంలోని దొనిరేవులపల్లెకు ఆనుకుని ఉన్న తమిళనాడు సరిహద్దులోని అటవీప్రాంతంలో విషం సేవించి స్పృహ కోల్పోయారు. సాయంత్రం ఆ మహిళ స్పృహలోకి వచ్చింది. దిలీప్‌ అప్పటికే చనిపోయాడు. ఇంతలో వారి బంధువులు గాలిస్తూ అక్కడికి చేరుకున్నారు. ఆమెను చీలాపల్లె సీయంసీకి తరలించడంతో కోలుకుంది. చిత్తూరులో పోస్టుమార్టం అనంతరం దిలీప్‌ మృతదేహాన్ని సోమవారం అతడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top