బిర్యాని వండలేదని భార్యపై కత్తితో దాడి

Man Stabs Wife Allegedly Not Making Biryani For Dinner - Sakshi

ముంబై: ఒక వ్యక్తి తన భార్య రాత్రి భోజనానికి బిర్యాని వండలేదన్న కోపంతో కత్తితో తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని లతూర్‌లో చోటుచేసుకుంది. ఆగస్టు 31 రాత్రి సదరు వ్య​క్తి రాత్రి భోజనానికి బిర్యాని ఎందుకు వండలేదంటూ భార్యతో గొడవపడ్డాడు. ఈ విషయమై ఇద్దరి మద్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. దీంతో సదరు వ్యక్తి తన కుటుంబ సభ్యులు ఎంతగా చెబుతున్న వినకుండా భార్యని కత్తితో పొడిచి పరారయ్యాడు.

సదరు వ్యక్తిని పోలీసులు విక్రమ్‌ వినాయక్‌ దేదేగా గుర్తించి అతనిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. బాధిత మహిళ తీవ్రంగా గాయపడిందని, ఆస్పత్రిలో చికిత్స పొందుతుందని వెల్లడించారు. ఐతే ఈ కేసు విషయమై ఇంకా ఎవర్నీ అదుపులోకి తీసుకుని అరెస్టు చేయలేదని పోలీసులు తెలిపారు. 

(చదవండి: మావగారిపై చేయిజేసుకున్న మహిళా పోలీసు: వీడియో వైరల్‌)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top