విడాకులు కోరిన భార్య...కక్ష్యతో 20 సార్లు కిరాతకంగా పొడిచి... | Sakshi
Sakshi News home page

విడాకులు కోరిన భార్య...కక్ష్యతో 20 సార్లు అతి కిరాతకంగా పొడిచి...

Published Fri, Mar 18 2022 8:16 PM

 Man Stabs Wife 20 Times For Seeking Divorce  - Sakshi

సాక్షి, బెంగళూరు: మతాలు వేరైనా అతని కోసం పేరు మార్చకుని మరీ వివాహం చేసుకుంది. అంతా హాయిగా ఉందనుకునేలోపే భర్త గురించి ఒక చేదు నిజం తెలుసుకుని షాక్‌కి గురైన ఆమె ఇక నీతో ఉండలేనంటూ కోర్టులో విడాకుల కోసం దాఖలు చేసింది. ఇదే ఆమె పాలిట శాపమైంది. అతను క్షక్యతో అందరూ చూస్తుండగానే ఆమె పై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ దారుణ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.

వివరాల్లోకెళ్తే...పోలీసు కథనం ప్రకారం...కర్ణాటకలోని గడగ్ జిల్లా హుబ్బలి నివాసి మహ్మద్ ఎజాజ్ షిరూర్‌ని అపూర్య పురాణిక్‌ తన పేరు మార్చుకుని మరీ వివాహం చేసుకుంది. అయితే అతని ఇంతకమునుపే వివాహం అయ్యి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారనే విషయం దాచి పెట్టి మరీ అపూర్వని పెళ్లి చేసుకున్నాడు. ఆమెతో తాను చదువుకుంటున్నానని పార్ట్‌ టైం ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాని మాయమాటలు చెప్పి అపూర్వని పెళ్లి చేసకున్నాడు. ఈ దంపతులనకు ఒక పాప కూడా ఉంది.

ఇక భర్త చేసిని మోసం తెలుసుకున్న అపూర్వ ఇక తనతో ఉండకూదని నిర్ణయించుకుని కోర్టులో విడాకుల కోసం పిటిషన్‌ దాఖలు చేసింది. దీంతో క్షక్య పెంచుకున్న అతను అపూర్వ కదలికల పై నిఘా పెట్టి మరీ ఆమె పై దాడి చేసేందుకు ఉపక్రమించాడు. అందులో భాగంగానే ఆమె స్కూటీ నేర్చుకుంటుండగా  కొడవలితో కిరాతకంగా దాడి చేశాడు.

దీంతో స్థానికులు ఆమెను ఆస్పుత్రికి తరలించారు. ఆమె  తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని అతన్ని అరెస్టు చేశాం. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, పైగా ఆమె శరీరంపై దాదాపు 22 కత్తి గాయాలు ఉన్నాయి" అని పోలీసులు చెప్పారు. అంతేకాదు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో,ప్రాణాలతో బయటపడిన వ్యక్తి "మీ ధర్మానికి విరుద్ధంగా వివాహం చేసుకోకండి" అంటూ ఒక  వీడియో​ వైరల్‌ అవుతోంది.

(చదవండి: కాబోయే భర్తే కదా అని సహజీవనం చేసింది.. ఇంతలో సీన్‌ రివర్స్‌..)

Advertisement
 
Advertisement
 
Advertisement