Maharashtra Man Loses Huge Amount While Ordering Food Online - Sakshi
Sakshi News home page

Cyber Crime: 2 మీల్స్‌కు ఆర్డర్‌ ఇవ్వండి.. ఒకటే మీల్‌కు డబ్బు చెల్లించండి!!

Published Fri, Dec 3 2021 9:14 PM

Man Ordered Food Online And Lost Rs 89,000 Know How - Sakshi

ముంబై: ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేసి ఓ వ్యక్తి పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కున్నాడు. సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఒక అడ్వర్‌టైజ్‌మెంట్‌ చూసి ఫుడ్‌ ఆర్డర్‌ ఇచ్చాడు. అంతే ఎకౌంట్లో డబ్బులన్నీ మాయం! అసలేంజరిగిందంటే..

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన బాబాసాహెబ్‌ థోంబ్రె (41)  అనే వ్యక్తి పేరుగాంచిన ఓ రెస్టారెంట్‌కు ఆన్‌లైన్‌లో ఫుడ్‌ ఆర్డర్‌ చేశాడు. సోషల్‌ మీడియాలో వచ్చిన అడ్వర్‌టైజ్‌మెంట్‌లో ఫుడ్‌ డిసౌంట్‌ ఆఫర్‌ చూసి ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ ఇచ్చాడట. రెండు మీల్స్‌ ఆర్డర్‌ చేస్తే ఒకటే మీల్‌కు ధర చెల్లింపు అనేదే ఆ డిస్కౌంట్‌. ఆర్డర్‌ ఇవ్వడానికి క్రెడిట్‌ కార్డు వివరాలు తెలపాలి. అలా చేయగానే వెంటనే అతని అకౌంట్‌ నుంచి 89 వేల రూపాయలు కట్‌ అయ్యాయని పోలీసధికారులు బుధవారం మీడియాకు తెలిపారు. కాగా సెప్టెంబర్‌లో ఈ సంఘటన చోటుచేసుకోగా... బాధితుడి పిర్యాదు మేరకు ఎమ్‌ఐడీసీ పోలీస్‌ స్టేషన్‌లో సెక్షన్‌ 420, ఐటీ చట్టం కింద మంగళవారం కేసు ఫైల్‌ చేసినట్లు పోలీసధికారి ఒకరు తెలిపారు. ఈ సంఘటనపై విచారణ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

చదవండిఒమిక్రాన్‌ ఎలుకల నుంచి మనుషులకు సోకిందా? ఎంతవరకు నిజం..

Advertisement
Advertisement