ఏసీ టెక్నీషియన్‌ పాడుపని.. నమ్మించి యువతిని హోటల్‌కు తీసుకెళ్లి.. | Man Molested Young Woman In Kakinada | Sakshi
Sakshi News home page

ఏసీ టెక్నీషియన్‌ పాడుపని.. నమ్మించి యువతిని హోటల్‌కు తీసుకెళ్లి..

Aug 25 2022 7:18 PM | Updated on Aug 25 2022 7:18 PM

Man Molested Young Woman In Kakinada - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

మీ నాన్న తీసుకు రమ్మన్నారంటూ నమ్మబలికి ఈ నెల 23న సాయంత్రం కాకినాడలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని పేర్కొన్నారు.

కాకినాడ క్రైం: తన కుమార్తెపై లైంగికదాడి జరిగిందంటూ ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానిక టూ టౌన్‌ పోలీసుల కథనం ప్రకారం.. తన కుమార్తెపై ఇంటి ఎదురుగా ఏసీ దుకాణంలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న పిఠాపురానికి చెందిన శేఖర్‌ అత్యాచారం చేశాడని కాకినాడ మిలటరీ రోడ్‌కు చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు ఇచ్చారు.
చదవండి: స్వీట్‌గా మాట్లాడి ​క్లోజ్‌ అవుతారు.. కలవాలని ఉందని చెప్పి..

మీ నాన్న తీసుకు రమ్మన్నారంటూ నమ్మబలికి ఈ నెల 23న సాయంత్రం కాకినాడలోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారం చేశాడని పేర్కొన్నారు. సాయంత్రం ఇంటికి వచ్చిన తన కుమార్తె జరిగిన విషయాన్ని తెలిపిందన్నాడు. బాలిక తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో వెలుగుచూసే వాస్తవాల ఆధారంగా చర్యలు చేపడతామని సీఐ రామచంద్రరావు వివరించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement