సమోసా తిన్నందుకు కొట్టి చంపేశాడు | Man killed for eating samosa without permission in Madhya Pradesh | Sakshi
Sakshi News home page

సమోసా తిన్నందుకు కొట్టి చంపేశాడు

Apr 26 2022 6:22 AM | Updated on Apr 26 2022 6:22 AM

Man killed for eating samosa without permission in Madhya Pradesh - Sakshi

భోపాల్‌: మానవత్వం మంటగలిసింది. డబ్బులివ్వకుండానే సమోసా తిన్నాడనే చిన్న కారణంతో దుకాణదారు ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టి చంపాడు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆదివారం ఈ దారుణం జరిగింది. చోళా ప్రాంతంలోని శంకర్‌నగర్‌లో హరిసింగ్‌ అహిర్వార్‌ దుకాణంలోకి మద్యం మత్తులో ఉన్న వినోద్‌ అహిర్వార్‌ (40) ప్రవేశించి సమోసాను తీసుకుని తినడం మొదలుపెట్టాడు. హరిసింగ్‌ కోపంతో తలపై కర్రతో కొట్టడంతో చనిపోయాడని పోలీసులు చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement