
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, యశవంతపుర(కర్ణాటక): మిత్రుని ఇంటికే కన్నమేసిన దొంగను బ్యాడరహళ్లి పోలీసులు అరెస్ట్ చేసి రూ.1.20 లక్షలు విలువైన నగలను స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రహళ్లి మొయిన్‌రోడ్డు నివాసి ఆటోడ్రైవర్ లక్ష్మినారాయణ నిందితుడు. స్నేహితుడు ఊరికి వెళ్లగా, ఇతడు చొరబడి బంగారు సొత్తును దొంగిలించాడు.
మరో కేసులో గంగమ్మగుడి పోలీసులు యలహంక వాసి అమీర్‌ఖాన్ (28)ని అరెస్ట్ చేసి 8 కేజీల గంజాయిని పట్టుఉకన్నారు. గంగమ్మగుడి సర్కిల్ వద్ద గంజాయి అమ్ముతున్నట్లు తెలిసి అరెస్ట్ చేశారు.