స్నేహానికి ద్రోహం.. ఫ్రెండ్‌ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకుని..

Man Escapes With Friend Wife And Children In Vikarabad District - Sakshi

బషీరాబాద్‌(వికారాబాద్‌ జిల్లా): ఇద్దరు పిల్లలతో కలిసి ఓ వివాహిత తన ప్రియుడితో పారిపోయింది. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు, ఫిర్యాదుదారుడి వివరాలు ఇలా ఉన్నాయి.. వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం మంతట్టి గ్రామానికి చెందిన గుడాల పరమేశ్, పావణి (పేరుమార్చాం) భార్యభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇదే గ్రామానికి చెందిన పిట్టలి విశ్వనాథ్, పరమేశ్‌ చిన్ననాటి స్నేహితులు. ఇద్దరూ ఎప్పుడూ కలిసే ఉండేవారు.
చదవండి: వెస్ట్‌ బెంగాల్‌ నుంచి యువతులను రప్పించి వ్యభిచారం

ఈ క్రమంలో పరమేశ్‌ భార్యతో విశ్వనాథ్‌ సన్నిహితంగా మెలిగేవాడు. ఇది వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీనిపై అనుమానం రావడంతో పరమేశ్‌ తన భార్యను నిలదీశాడు. అయినా వీరి తీరు మారకపోవడంతో కొద్ది రోజుల క్రితం గ్రామంలో పంచాయితీ పెట్టించాడు. ఆనాటి నుంచి పావణి, విశ్వనాథ్‌ దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో గత నెల 30న పావణి తన ఇద్దరు పిల్లలతో కనిపించకుండాపోయింది.

అదే రోజున విశ్వనాథ్‌పై అనుమానం వ్యక్తంచేస్తూ పరమేశ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన భార్య, ఇద్దరు పిల్లలను విశ్వనాథ్‌ అపహరించుకుపోయాడని, ఇంట్లోని నాలుగు తులాల బంగారం, రూ.42 వేలు కూడా తీసుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇలా ఉండగా.. విశ్వనాథ్‌కు మూడు నెలల క్రితమే అనురాధ అనే యువతితో వివాహం జరిగింది.

మరో మహిళను తీసుకుని పారిపోయాడని తన భర్తపై కేసు నమోదైనట్లు తెలుసుకున్న అనురాధ.. తన జీవితం ఏం కావాలని..? మామ పిట్టలి అంజిలప్పను నిలదీసింది. దీనిపై స్పందించిన ఆయన నాలుగు రోజుల్లో తన కొడుకు తిరిగిరాకపోతే.. ఆస్తి మొత్తాన్ని కోడలి పేరున రాస్తానని చెప్పాడు.  ఇదిలా ఉండగా తన భర్త కనిపించకుండా పోయాడని,  ఆయన ఆచూకీ కనుక్కోవాలని విశ్వనాథ్‌ భార్య అనురాధ సైతం   ఫిర్యాదు చేసింది.  ఈ మేరకు విశ్వనాథ్, పావణిపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విద్యాచరణ్‌రెడ్డి తెలిపారు.     

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top