స్నేహితుడికి నమ్మక ద్రోహం.. అంతటితో ఆగకుండా..

Man Cheated Friend In Vijayawada - Sakshi

రూ.50 లక్షలకు పైగా కుచ్చుటోపీ

పటమట పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు

ఆటోనగర్‌(విజయవాడ తూర్పు): స్నేహితుడిని నమ్మించి, నయవంచన చేసి రూ.50 లక్షలకు కుచ్చుటోపీ పెట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్రెడిట్‌ కార్డులతో పాటు 10 వేర్వేరు బ్యాంకుల్లో ఈ మొత్తాన్ని తీసుకుని ముఖం చాటేశాడు. దీనికి సంబంధించి వెంకట నాగకిరణ్‌ అనే వ్యక్తిపై పటమట పోలీస్‌ స్టేషన్‌లో 420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
చదవండి: పది రోజులకు ఒకసారి ప్రసాద్‌ ఇంటికి.. అనుమానాస్పద స్థితిలో..

పటమట ఎస్‌ఐ పవన్‌కుమార్, ఫిర్యాదు దారుడు తెలిపిన  వివరాల మేరకు ప్రసాదంపాడుకు చెందిన వై.వీర వెంకట నాగకిరణ్, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు వి.సాయిస్వప్న కుమార్‌ చిన్ననాటి నుంచి స్నేహితులు. వెంకట నాగకిరణ్‌ది కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం వాడవల్లి గ్రామం. గత 5 సంవత్సరాల నుంచి ప్రసాదంపాడులో ఉంటున్నాడు.  సాయిస్వప్నకుమార్‌ను నమ్మించి  రెండు సంవత్సరాల క్రితం పలు దఫాలుగా 15 క్రెడిట్‌ కార్డులను వెంకటకిరణ్‌ వాడుకున్నాడు.  అంతటితో ఆగకుండా మరలా వేర్వేరుగా 4 బ్యాంకుల్లో పర్సనల్‌ లోన్‌ కింద రూ.15 లక్షలను సాయిస్వప్నకుమార్‌ వెంకటనాగకిరణ్‌ అకౌంట్‌కి బదిలీ చేశారు.

15 క్రెడిట్‌ కార్డులకు సంబంధించి సుమారు రూ.27 లక్షలను డ్రాచేసినట్టు సాయిస్వప్నకుమార్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మొత్తానికి సంబంధించి అడగ్గా,  ఏడు నెలల క్రితం రూ.2.30 లక్షలు సాయిస్వప్నకుమార్‌కు వెంకటనాగకిరణ్‌ తిరిగి ఇచ్చాడు. స్నేహితుడు చేసిన మోసంపై గత నెల 25న సాయిస్వప్నకుమార్‌ విజయవాడ నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు ఇచ్చారు. ఈనెల 20న పటమట ఎస్‌ఐ పవన్‌కుమార్‌ సాయిస్వప్నకుమార్‌ను స్టేషన్‌కు పిలిపించి వివరాలు అడిగి తెలసుకున్నారు. వెంకటనాగకిరణ్‌కు ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఆమె పిల్లలు ఆ్రస్టేలియాలో ఉన్నత చదువులు చదువుతున్నారు. దీని కోసం ఈ మొత్తాన్ని వెంకటనాగకిరణ్‌కు ఇచ్చినట్టు పోలీసులకు సాయిస్వప్నకుమార్‌ వివరించారు. ఈ మేరకు పటమట పోలీసులు వెంకటనాగకిరణ్‌ పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.    

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top