Man Arrested For Killing Brother Murder Case - Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో బటన్‌ చాకు ఆర్డర్‌ చేసి..

Nov 8 2021 10:28 AM | Updated on Nov 8 2021 11:50 AM

Man Charged With Brothers Murder Case - Sakshi

సత్తుపల్లి: ‘అన్నను చంపేందుకు తమ్ముడు ఫ్లిప్‌కార్ట్‌లో బటన్‌ చాక్‌ను తెప్పించి.. పథకం ప్రకారం విచక్షణారహితంగా పొట్ట, ఛాతిలో పొడవడంతో అన్న పుల్లారావు మృతి చెందిన సంఘటన చర్చనీయాంశమైంది’. సత్తుపల్లి పట్టణ ఇన్‌చార్జ్‌ సీఐ కరుణాకర్‌ కథనం ప్రకారం.. అన్నను కత్తితో పొడిచి చంపిన తమ్ముడు ముడుదొడ్ల చిన్నికృష్ణను ఆదివారం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

సత్తుపల్లి మండలం రామానగరం పంచాయతీలోని బూరుగుమాలపల్లికి చెందిన చిన్నికృష్ణ పెనుబల్లి మండలంలోని ఓ ప్రైవేట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఎంటెక్‌ చదువుతూ మధ్యలోనే ఆపేసి తాపీ పనులకు వెళ్తున్నాడు. మృతుడు పుల్లారావుతో ఇంటి వాటాల విషయంలో రెండు రోజుల నుంచి తరచూ కావాలనే తమ్ముడు చిన్నికృష్ణ గొడవపడ్డాడు. ఇదే అదునుగా చేసి శనివారం రాత్రి కత్తితో దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement