యువతి పట్ల అసభ్యకర ప్రవర్తన.. బస్‌ దిగే లోపు పోలీసుల ఎంట్రీ

Man Booked For Harassing Woman On Bus At Kukatpally - Sakshi

సాక్షి, భాగ్యనగర్‌కాలనీ: ఆర్‌టీసీ బస్సులో వెళ్తున్న ఓ యువతి పట్ల అసభ్యంగా వ్యవహరించిన వ్యక్తిపై కేసు నమోదైన సంఘటన కూకట్‌పల్లి పోలీస్‌ స్టేసన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శంకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్‌ నుంచి ఆర్టీసీ బస్సులో ఓ యువతి(22) ప్రయాణిస్తున్న ఈ క్రమంలో బస్సులో ఎక్కిన ఓ యువకుడు ఆమె వైపు చూస్తూ అసభ్యకరంగా ప్రవర్తించాడు.

దీంతో వెంటనే ఆమె 100కు ఫోన్‌ చేయగా మియాపూర్‌ పోలీసులు అప్పటికే బస్సు కూకట్‌పల్లి వరకు రావడంతో అక్కడ పోలీసులను అప్రమత్తం శారు. దీంతో ఆమె బస్‌ దిగే వరకు.. అక్కడికి చేరుకున్న పోలీసులు తనపై అసభ్యకరంగా వ్యవహరించిన వ్యక్తిపై కేసు నమోదు చేశారు. తనను క్షేమంగా కాపాడినందుకు పోలీసులకు, మంత్రి కేటీఆర్‌కు సదరు యువతి ట్విట్టర్‌ ద్వారా కృతజ్ఞతలు తెలిపింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top