బాలికపై అత్యాచార యత్నం: ప్రతిఘటించిన సోదరి | Man Attempted Molestation On Minor Girl In Chittoor District | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచార యత్నం: ప్రతిఘటించిన సోదరి

Oct 5 2020 12:36 PM | Updated on Oct 5 2020 1:25 PM

Man Attempted Molestation On Minor Girl In Chittoor District - Sakshi

నిందితుడు ఆర్.శంకరప్ప

సాక్షి, చిత్తూరు: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. శనివారం రామసముద్రం మండలంలోని తిరుమలరెడ్డి పల్లెలో ఓ మైనర్‌ బాలికపై ఆత్యాచార యత్నానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. తిరుమలరెడ్డి పల్లెకు చెందిన రెడ్డెప్పకు నాలుగవ సంతనమైన మైనర్ బాలిక(15) తన సోదరి పావనితో కలిసి రోజు గొర్రెలు మేపడానికి సమీపంలోని కొండ ప్రాంతానికి వెళ్లేవారు. శనివారం యథావిధిగా బాలిక, ఆమె సోదరి గొర్రెలను మేపడానికి రెడ్డివారికుదవ ప్రాంతానికి వెళ్లారు. అదే అదునుగా భావించిన తిరుమలరెడ్డిపల్లెకు చెందిన ఆర్.శంకరప్ప(40) మైనర్ బాలికను పక్కనున్న పొదల్లోకి బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేయబోయాడు. దీంతో బాలిక భయంతో అరుపులు, కేకలు వేస్తూ తప్పించుకు వెళ్లడానికి ప్రయత్నం చేసింది.

కానీ, ఆ వ్యక్తి ఎంతకూ వదలకపోవడంతో తన చెల్లిని ఆ కామాంధుని నుంచి రక్షించుకోవటం కోసం పావని తన చేతిలోని కొడవలితో శంకరప్ప చేతిపై కొట్టగా అతడు అక్కడి నుంచి పారిపోయాడు. అతను గత కొంతకాలంగా మైనర్‌ బాలికపై అత్యాచారానికి పాల్పడాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయమై బాలిక తల్లిదండ్రులు శంకరప్పను అనేక సార్లు హెచ్చరించిన లెక్కచేయలేదని తెలుస్తోంది. సోమవారం బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు శంకరప్పను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement