ఇడ్లీ తిన్నాడు.. బిల్లు అడిగితే తన్నాడు! | man attacked in hotel | Sakshi
Sakshi News home page

ఇడ్లీ తిన్నాడు.. బిల్లు అడిగితే తన్నాడు!

Jul 23 2024 8:42 AM | Updated on Jul 23 2024 8:42 AM

man attacked in hotel

మార్కాపురం: హోటల్‌కు వెళ్లి సర్వర్‌తో ఇడ్లీ తెప్పించుకుని పుష్టిగా ఆరగించిన ఓ యువకుడు బిల్లు చెల్లించాలని అడిగిన సిబ్బందిపై ఒక్కసారిగా దాడికి దిగాడు. ఈ సంఘటన సోమవారం మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఒక హోటల్లో చోటుచేసుకుంది. వివరాలు.. ఆర్టీసీ డిపో ఎదురుగా ఉన్న ఓ హోటల్లో కె.మహేష్‌రెడ్డి ఇడ్లీ తిన్నాడు. 

హోటల్‌ బాయ్‌ అంజి బిల్లు కట్టాలని కోరగా మహేష్‌ దాడికి దిగాడు. అడ్డుకోబోయిన హోటల్‌ సిబ్బంది పరమేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డిపైనా మహేష్‌ దాడికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై అబ్దుల్‌ రెహమాన్‌ తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement