కోడలు అడ్డదారులు తొక్కుతోందని హతమార్చిన మామ | Man Assassinates His Daughter In Law Over Illegal Affair Doubts | Sakshi
Sakshi News home page

కోడలు అడ్డదారులు తొక్కుతోందని హతమార్చిన మామ

Jul 31 2021 11:15 AM | Updated on Jul 31 2021 11:15 AM

Man Assassinates His Daughter In Law Over Illegal Affair Doubts - Sakshi

హతురాలు ప్రియమణి (పాతచిత్రం)

మలికిపురం: కోడలిని మామ దారుణంగా హత్య చేసిన సంఘటన మేడిచర్లపాలెంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన చొప్పల సత్యనారాయణకు ప్రియమణి (25) స్వయానా సోదరి కూతురు. సోదరి కుటుంబం అండమాన్‌లో నివాసం ఉంటోంది. సత్యనారాయణ కుమారుడు విజయ్‌కుమార్‌ కూడా ఉపాధి కోసం అండమాన్‌ వెళ్లాడు. ప్రియమణిని ఏడేళ్ల క్రితం అక్కడే వివాహం చేసుకుని స్వగ్రామానికి తీసుకు వచ్చాడు.

అనంతరం విజయ్‌కుమార్‌ ఉపాధి రీత్యా గల్ఫ్‌లో ఉంటున్నాడు. వారికి ఒక కొడుకు. ఈ నేపథ్యంలో అడ్డదారులు తొక్కుతోందన్న ఆగ్రహంతో కోడలు ప్రియమణిని సత్యనారాయణ కత్తితో పొడిచి, పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు. తానే హత్య చేశానని పోలీసులకు తెలిపాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై నాగరాజు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement