దారుణం: వంట రుచిగా వండలేదని స్నేహితుడ్ని..

Man Assassinated Friend Over Fight On Food - Sakshi

ముంబై : ఆహారం విషయంలో జరిగిన గొడవ ఓ నిండు ప్రాణం తీసింది. తనకు నచ్చినట్లుగా వంట రుచిగా వండలేదని స్నేహితుడ్ని పొట్టన పెట్టుకున్నాడో వ్యక్తి. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో బుధవారం వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముంబైకి చెందిన 27 ఏళ్ల వ్యక్తి(బాధితుడు), స్నేహితుడి(నిందితుడు)తో కలిసి దహిసర్‌ ఏరియాలోని ఓ కన్‌స్ట్రక్షన్‌ సైట్‌లో పని చేస్తున్నాడు. మంగళవారం వంట విషయంలో ఇద్దరికీ గొడవైంది. తనకు నచ్చిన విధంగా వంట చేయలేదంటూ నిందితుడు.. బాధితుడిపై గొడవకు దిగాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్యా వాగ్వివాదం చోటుచేసుకుంది. ఒకరినొకరు బూతులు తిట్టుకున్నారు.

దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నిందితుడు.. బాధితుడి తలపై పారతో గట్టిగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గొడవను ఆపటానికి వచ్చిన మరో వ్యక్తిపై కూడా నిందితుడు దాడి చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. 

చదవండి : దారుణం: బయటకు చెబితే తన తండ్రిని అరెస్టు చేస్తారని..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top