Man Killed His Ex Wife In Mandya - Sakshi
Sakshi News home page

15 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి, విడాకులు.. చెరుకు తోటలోకి లాక్కెళ్లి!

Jan 30 2022 12:32 PM | Updated on Jan 30 2022 1:46 PM

Man Assassinated Ex Wife In Karnataka - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, మండ్య(కర్ణాటక): విడిపోయి ఉంటున్న మాజీ భార్యను కిరాతక భర్త దారుణంగా గొంతు కోసి చంపాడు. ఈ దుర్ఘటన మండ్య తాలూకాలోని రాగిముద్దనహళ్ళి గ్రామంలో చోటుచేసుకుంది. హతురాలు షాలిని (32), కాగా నిందితుడు సురేష్‌ (40). వివరాలు.. వీరిద్దరూ 15 ఏళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. దంపతుల మధ్య, అలాగే అత్త– కోడలు మధ్య గొడవలు జరుగుతున్నాయి.

దీంతో నాలుగైదు సంవత్సరాల క్రితం షాలిని భర్త నుంచి విడాకులు తీసుకుని తన ఇంట్లోనే పిల్లలతో ఉంటూ కూలిపనులకు వెళ్లేది. డ్రైవర్‌ అయిన సురేష్‌ శుక్రవారం సాయంత్రం కూలి పనులకు వెళ్లి ఇంటికి వస్తున్న షాలినిని దగ్గర్లోని చెరుకు తోటలోకి లాక్కెళ్లి చాకుతో గొంతుకోసి ప్రాణాలు తీశాడు. తరువాత పరారయ్యాడు. మండ్య గ్రామీణ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.  
చదవండి: విజయవాడ: టీడీపీ నేత వేధింపులు తాళలేక బాలిక ఆత్మహత్య?

Advertisement
 
Advertisement
Advertisement