వ్యాక్సిన్‌ పేరు చెప్పి మిమ్మల్ని ముంచేస్తారు జాగ్రత్త | Malware virus on social media for covid-19 vaccine Registration in India | Sakshi
Sakshi News home page

వ్యాక్సిన్‌ పేరు చెప్పి మిమ్మల్ని ముంచేస్తారు జాగ్రత్త

May 6 2021 2:13 PM | Updated on May 6 2021 3:31 PM

Malware virus on social media for covid-19 vaccine Registration in India - Sakshi

దేశంలోని 18 ఏళ్లకు పైబడిన వారికి కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ అందించేందుకు కేంద్రం కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా కేంద్రం సూచించిన యాప్‌ ను ఇన్‌ స్టాల్‌ చేసుకొని సంబంధిత వ్యక్తిగత వివరాల్ని అప్‌ డేట్‌ చేస్తే మనకు కన్ఫాం ఓటీపీ వస్తుంది. అయితే అదే సమయంలో కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను క్యాష్‌ చేసుకునేందుకు కేటుగాళ్లు ప్రయత్నిస్తున్నారు.  మాల్వార్‌ సాయంతో ఓ లింక్‌ ను తయారు చేసి సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. పొరపాటు ఎవరైనా ఆ లింక్‌ను క్లిక్‌ చేస్తే అంతే సంగతులు. బ్యాంక్‌ అకౌంట్లలో ఉన్న డబ్బు మటుమాయం అవుతుంది.     

మాల్వేర్‌ రిసెర్చ్‌ సంస్థ స్టెఫాంకో ప్రకారం.. భారత్‌ కు చెందిన వినియోగదారుల్ని లక్ష్యంగా చేస్తూ కరోనా వ్యాక్సిన్‌ కోసం రిజిస్ట్రేషన్‌ కోసం లాగిన్‌ అవ్వండి అంటూ ఓ టెక్ట్స్‌ రూపంలో మెసేజ్‌ వస్తుంది. ఆ టెక్ట్స్‌ కింద ఓ మాల్వేర్‌ లింక్‌ ఉంటుంది. అంటే బ్యాంక్‌ అకౌంట్లలో ఉన్న డబ్బుల‍్ని కాజేసేలా తయారు చేశారు. ఆ లింక్‌ ను ఒక్కసారి క్లిక్‌ చేస్తే అకౌంట్లలో ఎన్నికోట్లున్నా క్షణాల‍్లో మాయమవుతాయని మాల్వేర్‌ రీసెర్చ్‌ సంస్థ స్టెఫాంకో ప్రతినిధులు చెబుతున‍్నారు.  

అయితే ఇలాంటి మాల్వేర‍్ల సురక్షితంగా ఉండాలంటే కేంద్ర అధికారిక వెబ్‌ సైట్‌, కోవిన్ యాప్ లను మాత్రమే ఇన్‌ స్టాల్‌ చేసుకోవాలని కోవిన్‌ చీఫ్‌ ఆర్‌ఎస్‌ శర్మ తెలిపారు. ఆ లింక్స్‌ సంబంధిత ఫ్లాట్‌ ఫామ్‌ లలో లాగిన్‌ అవ్వడం వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తవని, ఎందుకంటే రిజిస్ట్రేషన్‌కు ఓటీపీ అవసరమని, ఆ ఓటీపీ  కోవిన్ లింక్‌ ద్వారా మాత్రమే వస్తుందని అన్నారు. కాబట్టి కోవిడ్‌-12 రిజిస్ట్రేషన్ల ప్రక‍్రియను జాగ్రత్తగా చెక్‌ చేసుకోవాలన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement